అంద‌మైన ప్రాంతం మ‌హారాజ‌పురంః అదా శ‌ర్మ‌

విహార యాత్రం కోసం మాల్దీవుల బాట ప‌డుతున్న సినీ ప్ర‌ముఖుల‌కు హీరోయిన్ అదాశ‌ర్మ చిన్న‌పాటి కౌంట‌ర్ ఇచ్చింది. మాల్దీవుల‌ను మించిన అంద‌మైన ప్రాంతం భార‌త్ లోనే ఉంద‌ని తెలిసింది. త‌మిళ‌నాడు ,కేర‌ళ స‌రిహ‌ద్దులో ఉన్న చిన్న గ్ర‌మమైన మ‌హారాజ‌పురానికి సంబంధించిన కొన్ని వీడియోల‌ను అదాశ‌ర్మ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. షూటింగ్ నిమిత్తం అదా ఆప్రాంతానికి వెళ్లింది. అక్క‌డ ప్ర‌కృతి అందాల‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది.మాల్దీవులు కాదు.. మ‌హారాజపురం. అక్క‌డికి ఎలా వెళ్లాల‌ని అడ‌గ‌కండి. ఇక్క‌డ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి షూటింగ్‌లూ జ‌ర‌గ‌లేదు. నేను చాలా ల‌క్కీ అని పేర్కొంది. అదా ప్ర‌స్తుతం రెండు సినిమాల్లో నూ, ఓ వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *