ఆచార్య మూవీ ఫ్యాన్స్‌కు కావాల్సిన సాలిడ్ అప్డేట్స్ భ‌లే..

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మ‌ళ్ళీ టీజ‌ర్ ఫీవ‌ర్ మొద‌ల‌య్యింది. ఆ మ‌ధ్య త‌మ్ముడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న వ‌కీల్‌సాబ్ టీజ‌ర్‌తో ప‌లక‌రించ‌గా ప్రస్తుతం అన్న‌య్య బాస్ మెగాస్టార్ చిరంజీవి వంతు వ‌చ్చింది. మ‌రి దీనిపై సాలిడ్ ఎంట‌ర్టైన్మెంట్ ఇస్తూనే ఆ టీజ‌ర్ పై అలెర్ట్ చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు కొర‌టాల శితో ప్లాన్ చేసిన బిగ్ బ‌డ్జెట్ మూవీ ఆచార్య తాలూకా టీజ‌ర్‌ను మేక్స‌ర్ వ‌చ్చే జ‌న‌వ‌రి 29న ఫిక్స్ చెయ్య‌గా అందులో ఓ ఊహించ‌ని స‌ర్ప్రైజ్ ను మ‌రో మెగా హీరో వ‌రుణ్ తేజ్ రివీల్ చేశారు. నిన్న మెగాస్టార్ ఎలా అయితే మీమ్ ఫార్మాట్ లో టీజ‌ర్ అప్డేట్ ఇచ్చారో అలాగే వ‌రుణ్ కూడా టీజ‌ర్‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ ఉన్న‌ట్టుగా హింట్ ఇచ్చాడు. దీనితో ఇంకో మాట లేన‌ట్టే అని చెప్పాలి. మొత్తానికి మాత్రం సోష‌ల్ మీడియాలో అదిరిపోయే ఎంట‌ర్టైన్మెంట్ మ‌రియు ఫ్యాన్స్‌కు కావాల్సిన సాలిడ్ అప్డేట్స్ ను భ‌లే ఇస్తున్నారని చెప్పాలిజ మ‌రి ఈ మోస్ట్ అవైటెడ్ టీజ‌ర్ ఎలా ఉంటుందో తెలిపాయి అంటే అప్ప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *