మూవీకి మ‌రో లెవెల్ కి ఆచార్య …..

టాలీవుడ్ లెజెండ‌రీ హీరో మెగాస్టార్, కాజ‌ల్ అగ‌ర్వాల్ కాంబినేష‌న్ లో న‌టిస్తున్న తాజా మూవీ ఆచార్య బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీపై మొద‌టి నుంచి కూడా మంచి అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి దీనికి ఒక్కొక్క‌టిగా యాడ్ చేస్తూ మేక‌ర్స్ ఆ హైప్ ను మ‌రో లెవెల్ కి తీసుకెళ్లారు. మెగా త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఎంట్రీ తో ఈమూవీ మ‌రో స్థాయికి వెళ్ళింది. అయితే మెగా ఫ్యాన్స్‌కు ఇది మంచి ఊపు ఇచ్చినా రియ‌ల్ మూవీ ల‌వ‌ర్స్‌కి మాత్రం చిరు మ‌రియు మ‌ణిశ‌ర్మ‌ల కాంబినేష‌న్‌లో అనే మ‌రోఆస‌క్తి ఉంది. దీనితో ఎలా ఉంటుంది. వింటేజ్ మ్యాజిక్ చేస్తారా అన్న‌దానికి మాత్రం నిన్న విడుద‌లైన‌లాహే లాహే ఫ‌స్ట్ సింగిల్ తో స‌మాధానం దొరికింది. దీనికి ఈ కాంబినేష‌న్ పై మంచి అంచ‌నాలు ఉన్న‌వారు , సంగీత ప్రియులు, మెగా ఫ్యాన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వ‌స్తుంది. మ‌ళ్ళీ పాత రోజుల‌ని గుర్తు చేస్తార‌ని పుల్ ఆల్బ‌మ్ కోసం ఎదురు చూస్తున్నారు. మ‌రి ఈమూవీలో మిగ‌తా సాంగ్స్ కూడా హిట్ట‌యితే మ‌ళ్లీ ..స్టాలిన్‌.. జై చిరంజీవ రోజులు వెన‌క్కి వ‌చ్చేన‌ట్టే .మొత్తానికి మాత్రం ఈ సాంగ్‌తో అంచ‌నాలు మ‌రింత అయ్యాయి త‌ప్పితే చెక్కుచెద‌ర‌లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *