ఎన‌ర్జిటిక్ గా స్టైలిష్ డ్యాన్స్ తో చిరు…

టాలీవుడ్ లెజెండ్ హీరో మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో న‌టిస్తున్న ప్రాజెక్ట్ ఆచార్య క్రియేట‌వ్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ మూవీ నుంచి లాహే లాహే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. చిరు మునుప‌టిలా చాలా ఎన‌ర్జిటిక్ గా స్టైలిష్ డ్యాన్స్ తో అద‌ర‌గొడ‌తాడ‌ని ర‌షెస్ చూస్తే తెలిసిపోతుంది. చిరంజీవి స్టెప్పుల‌కు థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు ఈల‌లు వేయ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. రామ‌జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట‌ను హారిక నారాయ‌ణ్‌, సాహితి చాగంటి పాడారు. ఫోక్ మెలోడిగా సాగే ఈ పాట‌కు మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ప్రాణం చేసిందనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *