పాఠాలు కాదు చెప్పెది గుణ‌పాఠాలు చెప్తాననేమో..

టాలీవుడ్ అగ్ర‌హీరో చిరంజివీ క్రియేటివ్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ ఆచార్య అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఆచార్య మూవీపై భారీ అంచ‌నాలు వెలువెత్తున్నాయి.ముఖ్యంగా సైరా మూవీ తెలుగులో మాత్ర‌మే ఆడ‌టంతో ఆచార్య‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాలనే క‌సితో ఉన్నాడు. మెగాస్టార్‌. సామాజిక అంశాల‌ను క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ద్ది తెర‌కెక్కించ‌డంలో కొర‌టాల శివ గొప్ప నేర్ప‌రీ. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిత్రాన్నికి కూడా ఇదే చేస్తున్నాడు. ఈ ద‌ర్శ‌కుడు, ఆచార్య ను కూడా అన్నిక‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కిస్తున్నాడు. రామ్‌చ‌ర‌ణ్‌, చిరంజీవి లాంటి క‌ల‌యిక‌ను క‌లిపాడు. ప్ర‌స్తుతం విడుద‌లైన టీజ‌ర్ చూస్తుంటే మూవీపై భారీ అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి.పాఠాలు చెప్పె అల‌వాటు లేక‌పోయినా ఆచార్య అని ఎందుకు అంటారు . బ‌హుశా గుణ‌ఫాఠాలు చెప్తాన‌నేమో? అంటూ చిరు చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. టీజ‌ర్ అంతా యాక్ష‌న్ ప్యాక్డ్‌గా నింపేసాడు కొర‌టాల శివ‌. బ‌ల‌హీనులకు తోడుగా నిల‌బ‌డానికి దేవుడే రావాల్సిన అవ‌స‌రం లేదు. దేవుడు లాంటి వాడు వ‌స్తే స‌రిపోతుంది. అదే కాన్సెప్టుతోనే ఆచార్య వ‌స్తుంది. మ‌ణిశ‌ర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ టీజ‌ర్‌కు మ‌రో ప్ర‌ధాన‌మైన హైలైట్‌. కేవ‌లం చిరంజీవిని మాత్ర‌మే ఎక్కువ‌గా ఫోక‌స్ చెసాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల‌. 2021 స‌మ్మ‌ర్‌లోనే ఆచార్య విడుద‌ల కానుంది. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సంయుక్తంగా ఈ మూవీన్ని నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *