డిఫ‌రెంట్ షేడ్స్‌లో ఆది క‌నిపిస్తున్నాడు……

టాలీవుడ్ యంగ్ హీరో ఆది త‌న కెరీర్ ఆరంభంలో మంచి యూత్ పుల్ ఎంట‌ర్టైన‌ర్స్ తీసిన ఆదికు ప్ర‌స్తుతం అత్య‌వ‌స‌రంగా హిట్ దొర‌కాల్సిన ప‌రిస్థ‌తి. మ‌రి ఆ మ‌ధ్య‌లో ఆది కొన్ని ప్ర‌యోగాలు చేసినా స‌రైన స‌క్సెస్ అందుకోలేదు. మ‌రి ఈసారి మ‌ళ్ళీ ఒక ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీతో వ‌స్తున్నాడు. అదే శ‌శి అది హీరోగా శ్రీ‌నివాస్ నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన ఈ లేటెస్ట్ మూవీ తాలూకా టీజ‌ర్ ను ఈ రోజు ఆది పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మెగాస్టార్ చేతుల‌మీద‌గా విడుద‌ల చేశారు. ఇక ఈ టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే డిఫ‌రెంట్ షేడ్స్‌లో ఆది క‌నిపిస్తున్నాడు. అలాగే ఇంత‌కు ముందు ఎప్పుడూ ట్రై చెయ్య‌ని లుక్‌లో క‌నిపించి ఓల‌వ్ ఫెయిల్యూర్ పెయిన్‌ను ఈ టీజ‌ర్‌లో అవుట్ స్టాండింగ్ చూపించాడు. ఇది కొంచెం ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా సుర్భ‌పురానిక్ న‌టించింది. అయితే కాస్త అర్జున్ రెడ్డి షేడ్స్ ఇందులో క‌నిపించినా ఆది నుంచి డిఫ‌రెంట్ అనే చెప్పాలి. అలాగే ఈ టీజ‌ర్ లోడైలాగ్స్ కూడా మంచి ఫీల్‌తో క‌లిగి ఉన్నాయి. అలాగే అరుణ్ చిలివేరు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. అంతే కాకుండా అమ‌ర‌నాథ్ బొమ్మిరెడ్డి ఇచ్చిన మూవీ టోగ్ర‌ఫీ కూడా బాగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *