స్టిన్నింగ్ డ్యాన్స్ తో అల‌రించ‌నున్న చిరు…

టాలీవుడ్ యాక్ట‌ర్ చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య చిత్రంలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 6 నెల‌ల విరామం త‌ర్వాత త్వ‌ర‌లో హైద‌రాబాద్ లో షూటింగ్ షూరూ చేసేందుకు రెడీ అవుతోంది. చిరు అండ్ టీం. అయితే ఈ చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో ఒక‌టి ఉంటుంద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. ముందుగా చెప్పిన‌ట్టుగా అందాల రెజీనా చిత్రంలో స్పెష‌ల్‌సాంగ్‌లో మెరువ‌నుంది. అయితే . చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైది నం 150 చిత్రంలో మాత్రం చిరు త‌న‌దైన మ్యాన‌రిజం, స్టైల్‌తో డ్యాన్స్ చేసినా.. మునుప‌టిలా డ్యాన్స్ చేయ‌లేద‌నే చెప్పాలి. కానీ ఆచార్య చిత్రంలో మాత్రం చిరు త‌న డ్యాన్స్ స్టైల్ ను మ‌ళ్లీ అభిమానుల‌కు రుచిచూపించేందుకు రెడీ అవుతున్నాడ‌ట‌. చిరంజీవి స్టామినా, ఇమేజ్ కు ఏమాత్రం త‌గ్గ‌కుండా డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నార‌ట కొరియోగ్రాఫ‌ర్‌. దీంతో సిల్వ‌ర్ స్ర్కీన్‌పై అభిమానుల‌ను చిరంజీవి ఇర‌గ‌దీసే స్టెప్పుల‌ను మ‌ళ్లీ చూసే అవ‌కాశం ద‌క్క‌నుంద‌న్న‌మాట‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *