స్టార్ హీరో కూతురికి త‌ప్ప‌ని వేధింపులు..

బాలీవుడ్ అగ్ర‌హీరో అయిన అమిర్ ఖాన్ కుమారైకు లైంగిక వేధింపులు త‌ప్ప‌లేదు. ఖాన్ త్ర‌యంలో ఒక‌రైనా అమిర్ ఖాన్ కుమారై ఐరా ఖాన్ రీసెంట్‌గా త‌న మాన‌సిక ఒత్తిడికి సంబంధించిన వీడియో సందేశాన్ని త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇందులో ఆమె త‌న లైఫ్‌లో ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల గురించి మాట్లాడారు. నాకు అన్నీ సౌక‌ర్యాలు దొరికాయి. అయినా నా మాన‌సిక ఒత్తిడికి గ కార‌ణాల‌పై అన్వేష‌ణ చేస్తున్నా స‌మాధానం దొర‌క‌డం లేదు. అయితే కాకుండా మూడున్న‌రేళ్ల క్రితం నా ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చిన‌ప్పుడు.. నేను ఏదో విష‌యంపై దీర్షంగా ఆలోచిస్తుండేదాన్ని, ఒంట‌రిగా గ‌దిలో ఉండేదాన్ని కానీ త‌రువాత దాని వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేద‌ని తెలిసింది. నా త‌ల్లిదండ్రులు విడాకులు తీసుకునేట‌ప్పుడు నేను చాలా చిన్న‌దాన్ని. ఆవిష‌యం న‌న్నంత‌గా వ‌చ్చిన‌ప్పుడు కూడా బాధ‌ప‌డ‌లేదు. 14 ఏళ్ల వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు నాకు లైంగిక వేధింపుల‌కు గుర‌య్యాను. ఆ వ్య‌క్తి ఏం చేస్తున్నాడో నాకు తెలిసేది కాదు. కానీ ఎప్పుడో ఒక‌ప్పుడు నాకు ఈ ప‌రిస్థితి ఎదుర‌య్యేది. ఏడాది త‌ర్వాత నాకు విష‌యం
అర్థ‌మైంది. మెయిల్ ద్వారా విష‌యాన్ని నా త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌జేసి స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ్డాను.
ఈ స‌మ‌స్య కూడా నాపై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. అని చెప్పిన ఐరా త‌న మాన‌సిక ఒత్తిడికి గ‌ల కార‌ణాల‌ను మాత్రం చెప్ప‌లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *