సుంద‌రానికి తొంద‌రెక్కువ అంటున్నా నాని

నిన్న‌నాని28వ సినిమాను మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో చేయ‌బోతున్న‌ట్లుగా అధికారిక ప్ర‌క‌ట‌న వచ్చిన విష‌యం తెల్సిందే. నేడు సినిమా ద‌ర్శ‌కుడు మ‌రియు హీరోయిన్ విష‌య‌మై క్లారిటీ ఇచ్చారు. బ్రోచేవారు ఎవ‌రురా చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయా ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొంద‌బోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా త‌మిళ ముద్దుగుమ్మ న‌జ్రియా న‌టించ‌బోతుంది అంటూ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ సినిమాకు విభిన్న‌మైన టైటిల్‌ను ఆయ‌న ఫిక్స్ చేసిన‌ట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకు అంటే సుంద‌రానికి.. అనే టైటిల్‌ను ఖారారు. చేసిన‌ట్లుగా ప్రచారం జ‌రుగుతుంది. సుంద‌రానికి తొంద‌రెక్కువ అనే ప‌దాన్ని మ‌నం చాలా సార్లు వినే ఉంటాం.. ఆడైలాగ్ నుండే ఈ సినిమా టైటిల్ ను తీసుకున్నార‌ని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *