సీని న‌టులు చిరంజీవి, నాగార్జున సీఎం కేసిఆర్ ను క‌లిసారు…

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు భేటీ అవుతూనే ఉంటారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అక్క‌డ ఏం జ‌రుగుతుంది… ఏదైనా స‌మ‌స్య‌లున్నాయా అంటూ వాక‌బు కూడా చేస్తుంటారు. మ‌రోవైపు ఇండ‌స్ట్రీ నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు పెద్ద‌లు వ‌చ్చి సిఎంతో భేటీ అవుతుంటారు. ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా చెప్తుంటారు.. ఏదైనా సాయం కావాల్సిన‌పుడు వ‌చ్చి అడుగుతుంటారు. అలా ఇండ‌స్ట్రీ నుంచి ఎప్పుడూ సీఎంను క‌లిసే వాళ్ల లిస్టులో చిరు, నాగార్జున ముందుంటారు. తాజాగా మ‌రోసారి వాళ్లుకేసీఆర్ తో అయ్యారు. తాజాగా ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోనే ముఖ్య‌మంత్రిని క‌లిసి కొన్ని విష‌యాలు చ‌ర్చించారు.చిరు, నాగ్‌. ఆ మ‌ధ్య లాక్‌డౌన్ స‌మ‌యంలో కూడా ఇలాగే ముఖ్య‌మంత్రిని క‌లిసారు ఈ ఇద్ద‌రూ . ఇప్పుడుమ‌రోసారి ఇదే చేసారు. మొన్నామ‌ధ్య హైద‌రాబాద్‌ను అత‌లాకులం చేసిన వ‌ర‌ద‌ల‌లో ఎంతో మంది న‌ష్ట‌పోయారు ఆర్థికంగాకూడా వేల కోట్ల న‌ష్టం వ‌చ్చింది. ఇందులో ఎంతో మంది నిరాశ్ర‌యుల‌య్యారు. ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు కూడా పోయాయి. దాంతో వాళ్ల‌ను ఆదుకోడానికి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ముందుకొచ్చింది. సిఎం రిలీఫ్ ఫండ్‌కు మ‌న హీరోలు చాలా మంది ల‌క్ష‌లు, కోట్ల రూపాయాలు విరాళంగా అందించారు. వాటిని ముఖ్య‌మంత్రికి అందించ‌డానికి కేసీఆర్ ను క‌లిసారు చిరంజీవి, నాగార్జున. అలాగే ఎలాంటి సాయం కావాల‌న్నా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని ఈ హీరోలు ఇండ‌స్ట్రీ త‌ర‌పు నుంచి ముఖ్య‌మంత్రికి చెప్పిన‌ట్లు తెలుస్తుంది. దాంతో పాటు తెలంగాణ థియేట‌ర్స్ ఓ పెనింగ్ గురించి కూడా
చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు ప్రచారం జ‌రుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *