వేస‌విలో ఆచార్య ఆగ‌మ‌నం

లాక్‌డౌన్ కార‌ణంగా నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన సినిమా తిత్రీక‌ర‌ణ‌ల‌న్ని తిరిగి మొద‌ల‌వుతున్న‌యి. ఈ వ‌రుస‌లో అగ్ర‌క‌థానాయకుడు చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య షూటింగ్ ఈ నెల 9 నుంచి పునఃప్రారంభం కానుంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌రెడ్డి నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు కొంత భాగం చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. త్వ‌ర‌లో ప్రారంభంకాబోతున్న షెడ్యూల్ సుదీర్ఘంగా గుతుంద‌ని… ఇందులో చిత్ర ప్ర‌ధాన తారాగ‌ణంపై ముఖ్య‌ఘ‌ట్టాల‌ను తెర‌కెక్కిస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. కోవిడ్ ప‌ర‌మైన అని ముందస్తు జాగ్ర‌త్త‌ల‌తో ప‌క‌డ్బందీగా షూటింగ్‌కు స‌న్నాహాలు చేస్తున్నామ‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *