రాజ‌శేఖ‌ర్ డిశ్చార్జి కావ‌డం ప‌ట్ల అభిమానుల హార్షం ….

తెలుగు ఇండ‌స్ట్రీలో క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తుంది. హీరో చిరంజీవికి తాజాగా క‌రోనా వ‌చ్చింది. అయితే ఈయ‌న కంటే ముందుగానే సీనియ‌ర్ హీరో రాజ‌శేక‌ర్ కూడా క‌రోనా బారిన ప‌డ్డాడు. గ‌త కొన్నిరోజులుగా ఈయ‌న సిటీ న్యూరో హాస్పిట‌ల్ లో చిక‌త్స తీసుకుంటున్నాడు. దాదాపు2 వారాలుగా అక్క‌డే ఉన్నాడు. ఈయ‌న . ఒక‌నొక స‌మ‌యంలో న‌టుడు రాజ‌శేఖ‌ర్ ప‌రిస్థితి విష‌మంగా కూడా మారిపోయింది. ఆయ‌న‌తో పాటు కుటుంబం అంతా క‌రోనా బారిన ప‌డ్డారు. అయితే కూతుళ్లు శివానీ, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌తో పాటు జీవిత కూడా త్వ‌ర‌లోనే క‌రోనా నుంచి కోలుకున్నారు. అయితే రాజ‌శేఖ‌ర్ మాత్రం కోలుకోలేదు. కొన్ని రోజుల నుంచి ఈయ‌న‌కు వైద్యుల స‌మ‌క్షంలో చికిత్స కొన‌సాగుతుంది. జీవిత కూడా ఎప్ప‌టిక‌ప్పుడు రాజ‌శేఖ‌ర్ ఆరోగ్య ప‌రిస్థితిపై విర‌వ‌ణ ఇస్తుంది. ఆ మ‌ధ్య ఈయ‌న్ని వెంటిలేట‌ర్‌పై కూడా ఉంచారు. వైద్యులు. ప‌రిస్థితి చేదాటిపోయిందేమో అని భ‌య‌ప‌డ్డామ‌ని చెప్పింది. జీవిత‌, అలాంటి ప‌రిస్థ‌తి నుంచి ఆయ‌న కోలుకున్నాడు. క‌రోనాతో ఫైట్ చేసాడు.. ప్రాణం కోసం పోరాడాడు. ఇప్పుడు ఈ మ‌హ‌మ్మారిని గెలిచాడు. నవంబ‌ర్ 9న ఈయ‌న్ని సిటీ న్యూర్ సెంట‌ర్ హ‌స్పిటల్ నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేసారు. ఇదే విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంది జీవిత‌. ఇక రాజ‌శేఖ‌ర్ కూడా హాస్పిట‌ల్ లో ఉన్న వాళ్ల‌తోఫోటోలు దిగాడు. త‌న త‌న ఆరోగ్యం కోసం శ్ర‌మించిన వైద్యులకు , న‌ర్సుల‌కు, వాళ్లంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. సిటీ న్యూరో సెంట‌ర్ త‌మ‌కు చాలా సాయ‌ప‌డింద‌ని జీవిత తెలిపింది. వాళ్లే లేక‌పోయుంటే ఈ రోజు త‌మ‌కు చాలా ఇబ్బందులు వ‌చ్చేవ‌ని చెప్పింది జీవిత‌, రాజ‌శేఖ‌ర్ ప్రాణాలు కాపాడిన వైద్యుల‌కు ఆమె మ‌న‌స్ఫ‌ర్థిగాకృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఆయ‌న త్వ‌ర‌లో కోలుకోవాల‌ని ఇండ‌స్ట్రీ నుంచి కూడా ఆయ‌న స‌న్నిహితులు కోరుకుంటున్నారు. రాజ‌శేఖ‌ర్ డిశ్చార్జి కావ‌డం ప‌ట్ల అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *