రాజ‌శేఖ‌ర్ అండ్ ఫ్యామిలీ దీపావ‌ళి వేడుక‌లు…

టాలీవుడ్ హీరోరాజ‌శేఖ‌ర్‌, న‌టి జీవిత వారి పిల్ల‌లు శివానీ, శివాత్మిక‌ల‌కు కొన్ని రోజుల క్రితం కోవిడ్ సోకిన విష‌యం తెలిసిందే శివానీ , శివాత్మిక ,జీవిత కోవిడ్ బారి నుండి త్వ‌ర‌గానే బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే హీరో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి కాస్త క్రిటిక‌ల్‌గానే మారింది. అయితే డాక్ట‌ర్స్ అందించిన ట్రీట్‌మెంట్ ,సినీ అభిమానులు స‌హా అంద‌రి ప్రార్థ‌న‌ల‌తో రాజ‌శేఖ‌ర్ కూడా క‌రోనా నెగ‌టివ్ రిపోర్ట్‌తో రీసెంట్‌గా హాస్పిట‌ల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. క‌రోనాను జ‌యించి వారియ‌ర్స్‌గా మారిన రాజ‌శేఖ‌ర్ అండ్ ఫ్యామిలీ దీపావ‌ళి పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకున్నారు. అందులో భాగంగా రాజ‌శేఖ‌ర్‌, జీవిత ,ఇద్ద‌రు పిల్ల‌లు క‌లిసి ఫొటో దిగారు. నాన్న త్వ‌ర‌లో కోలుకుంటున్నారు. మీ అంద‌రి ప్రేమ‌, ఆశీర్వాదాల‌కు ధ‌న్య‌వాదాలు అంటూ శివాత్మిక రాజ‌శేఖ‌ర్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *