మ‌నవ‌డితో బాల‌య్య అల్ల‌రి…

నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ వీలు కుద‌రిన‌ప్పుడల్లా మ‌న‌వ‌ళ్ల‌తో ఆడుకోవ‌డం న‌ట‌ర‌త్న నందమూరి బాల‌కృష్ణ‌కు ఎంతో ఇష్టం. కొద్దిగా స‌మ‌యం దొరికినా వారితో స‌మ‌యం గ‌డుపుతుంటారు. వారితో క‌లిసి అల్ల‌రి చేస్తుంటారు. బాల‌య్య కు ఇద్ద‌రు మ‌న‌వ‌ళ్లు ఉన్నారు. పెద్ద కుమారై బ్ర‌హ్మిణి కుమారుడు దేవాన్ష్‌, చిన్న కుమారై తేజ‌స్విని కొడుకు బాల‌య్య ను బాగా ఇష్ట‌ప‌డ‌తారు. వారి గురించి,వారి అల్ల‌రి గురించి బాల‌య్య అనేక ఇంట‌ర్వ్యూల్లో వెల్ల‌డించారు. తాజాగా బాల‌య్య త‌న ముద్దుల మ‌న‌వ‌డితో ఉన్న ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ ఫొటోలో బాల‌య్య‌, తేజ‌స్విని కుమారుడు ట్ర‌డిషిన‌ల్ దుస్తుల్లో చిరున‌వ్వులు చిందిస్తున్నారు ఈఫొటో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *