మోహ‌న్‌బాబు భ‌క్త‌వ‌త్స‌లం నాయుడుగా స్టిల్ చ‌క్క‌ర్లు….

టాలీవుడ్ లో ఆయ‌న‌న‌ను అంద‌రూ డైలాగ్ కింగ్‌, క‌లెక్ష‌న్ కింగ్ అని పిలుచుకుంటారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారు పేరుగా నిలిచే న‌టుల్లో ముందువ‌రుస‌లో ఉంటారు. న‌టుడు మోహ‌న్‌బాబు. సినిమాల్లోకి రాక‌ముందు భ‌క్త‌వ‌త్స‌లం నాయుడిగా ఉన్న ఆయ‌న సిల్వ‌ర్ స్క్రీన్ కు ప‌రిచ‌య‌మైన త‌రువాత మోహ‌న్‌బాబుగా పేరు మార్చుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఇపుడు ఈ సీనియ‌ర్ యాక్ట‌ర్ త‌న జీవిత పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య న‌టిస్తోన్న తాజా చిత్రం ఆకాశ‌మే నీ హ‌ద్దురా. ఈ చిత్రంలో మోహ‌న్‌బాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. మోహ‌న్‌బాబు ఈ చిత్రంలో ఎయిర్‌క‌మోడోర్ భ‌క‌వ‌త్స‌లం నాయుడిగా క‌నిపించ‌నున్నారు. ఈ పాత్ర‌కు సంబంధించిన స్టిల్ ఒక‌టి ఆన్ లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. రూల్స్‌ను తూచ‌త‌ప్ప‌కుండా పాటించే క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన ఆఫీస‌ర్ గా క‌నిపించ‌నున్నారు. సూర్య‌-మోహ‌న్‌బాబు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు స్పూర్తిని క‌లిగిస్తూ సినిమాకు హైలెట్ గా నిలువ‌నున్నాయ‌ట‌. అమెజాన్ ప్రైమ్‌లో న‌వంబ‌ర్‌12 న విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *