మెరుగుప‌డుతున్న రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం….

టాలీవుడ్ హీరో రాజ‌శేఖ‌ర్ కొద్ది రోజుల క్రితం క‌రోనాతో హైద‌రాబాద్ లోని సిటీ న్యూర్ సెంట‌ర్ ఆసుప‌త్రి లో చేరిన సంగ‌తి తెలిసిందే. నిపుణులైన వైద్యులు ఆయ‌న‌కు ప్ర‌త్యేక వైద్యం అందిస్తుండా, ఆయ‌న ఇప్పుడిప్పు కో లుకుంటున్నట్టు తెలుస్తుంది. హెల్త్ బులిటెన్స్ లోను రాజ‌శేఖ‌ర్ చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని చెప్ప‌డంతో అభిమానుల‌లో కొంత ఆందోళ‌న త‌గ్గింది. తాజాగా జీవితా రాజ‌శేఖ‌ర్ త‌న భ‌ర్త గురించి మాట్లాడుతూ… ఆయ‌న ఆరోగ్యం మెర‌గ‌వుతుంది. వైర‌స్ వ‌ల్ల శ‌రీరంలో క‌లిగిన ఇన్పెక్ష‌న్ త‌గ్గింది. ప‌లు ప‌రీక్ష‌ల అనంత‌రం ఆయ‌న్ను ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేయ‌నున్నార‌ని జీవితా పేర్కొన్నారు. కాగా, రాజ‌శేఖ‌ర్ క‌రోనాని జ‌యించి రావాల‌ని అభిమానుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్రార్ధ‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *