మెగా కోడ‌లి గెస్ట్ ఎడిట‌ర్‌గా ర‌శ్మికా మంద‌న్నా….

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, మెగా కుటుంబానికి కోడ‌లు ఉపాస‌న కొణిదెల నిర్వ‌హిస్తున్న యువ‌ర్ లైఫ్ వెబ్ పోర్ట‌ల్ కు గ‌త టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంతా అక్కినేని క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే జాబితాలో ప్ర‌ముఖ నాయిక ర‌శ్మిక‌మంద‌న్న గెస్ట్ ఎడిట‌ర్ గా క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే స‌మంత గెస్ట్ ఎడిట‌ర్‌గా ప‌లు ఆరోగ్య‌క‌ర‌మైన, రుచిక‌ర‌మైన రెసిపీలు ప‌రిచ‌యం చేశారు. అలాగే ర‌ష్మికా కూడా త‌న‌కు తెలిసిన హెల్త్ టిప్స్‌, హెల్దీ రెసిపీలు ప‌రిచ‌యం చేయ‌నుంది. ఈ మంగ‌ళ‌వారం యువ‌ర్ లైఫ్ వెబ్ పోర్ట‌ర్ త‌మ సంస్థ‌లోకి ర‌శ్మిక‌కు వెల్ క‌మ్ చెప్పారు. టుగెద‌ర్ ఫ‌ర్ వెల్ నెస్ అనే క్యాప్ష‌న్ తో ఆరోగ్యాన్ని అందిద్దాం అంటూ ఆహ్వానించారు. యువ‌ర్ లైఫ్ వెబ్ పోర్ట‌ల్ ద్వార పుడ్‌, వ‌ర్క‌వుట్స్ వంటి కంప్లీట్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేప‌డుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *