మాస్ మ‌హారాజ కొత్త సినిమా….

ర‌వితేజ క్రాక్ చిత్రం త‌రువాత నేను లోక‌ల్ ఫేమ్ న‌క్కిన త్రినాధ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి ర‌మేష్ వ‌ర్మ సినిమా ముందుగా మొద‌ల‌వ్వాలి. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ర‌మేష్ వ‌ర్మ సినిమా లేట్ అవుతోంద‌ట‌. ఆ కార‌ణంగా ర‌మేష్ వ‌ర్మ సినిమా కంటే కూడా త్రినాథ‌రావ్ న‌క్కిన సినిమానే ముందు మొద‌ల‌వుతుంద‌ట‌,కాగా ఈ సినిమా పుల్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్‌గా ఉంటుంద‌ని… సినిమాలో ర‌వితేజ క్యారెక్ట‌రైజ‌ష‌న్ మంచి కామెడీ టైమింగ్‌తో అద్భుతంగా ఉంటుంద‌ని స‌మాచారం. పైగా త్రినాథ‌రావ్ న‌క్కిన గ‌త చిత్రాలు కూడా సినిమా చూపిస్తా మామ నేను లోక‌ల్ వంటి సినిమాలు మంచి ఎంటైర్టైమెంట్ తో సాగిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా ర‌వితేజ కామెడీ పండించ‌గ‌ల‌డు. ర‌వితేజ అలాంటి కామెడీ సినిమాతోనే ఈ సారి త్రినాథ‌రావ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *