ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేతుల మీదుగా గ‌మ‌నం ట్రైల‌ర్‌……

ప్ర‌ముఖ సినీ న‌టి శ్రియ ప్రాధాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా గ‌మ‌నం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా సినిమాగా గ‌మ‌నం రానుంది. కాగా తాజాగా ఈసినిమా ట్రైల‌ర్‌ను ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రిలీజ్ చేశారు. టైట‌ర్ లోనే క‌థ‌ల‌ను పాత్ర‌ల‌ను చాలా బాగా ఎలివేట్ చేశారు. ప్ర‌తి క‌థ ఎమోష‌న‌ల్ గా సాగుతూ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది. ఇక శ్రియ‌, నిత్యామీన‌న్‌తో పాటు ఇంకా ఈ సినిమాలో ప్రియాంకా జ‌వాల్క‌ర్ ,శివ కందుకూరి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా ఈ సినిమాల‌కు సుజ‌నారావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా మాట‌ల‌ను అందిస్తున్నారు. జ్ఞాన‌శేఖ‌ర్ వి. ఎస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా చేస్తూనే, ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పుల‌తో క‌లిసి సంయుక్తంగా ఈసినిమాలో మ‌రో ప్ర‌ముఖ న‌టి నిత్యామీన‌న్ క్లాసిక‌ల్ సింగ‌ర్ శైల‌పుత్రీ దేవి పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *