ప్ర‌యోగ డేట్స్ స‌ర్దుబాటు కాక‌పోవడామే కార‌ణం….

టాలీవుడ్ నంద‌మూరి బాల‌కృష్ణ -బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో బీబీ 3 (వ‌ర్కింగ్ టైటిల్‌)తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా హీరోయిన్ల‌లో ఒక‌రిగా మ‌ల‌యాళ భామ ప్ర‌యోగ మార్టిన్ ను తీసుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌రువాత బాల‌కృష్ణ స‌ర‌స‌న సెట్ అవ్వ‌డం లేద‌నే కార‌ణంతో బోయ‌పాటి ప్ర‌యోగ‌మార్టిన్ ను ప‌క్క‌కు పెట్టాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ప్ర‌యోగ మార్టిన్‌ను ప్రాజెక్టులోకి తీసుకున్న ట్టే తీసుకొని.. మ‌ళ్లీ వెన‌క్కి నెట్ట‌డానికి కార‌ణం వేరే ఉంద‌ట‌. ఓ ఇంట‌ర్వ్యూలో నిర్మాత మిర్యాల‌ర‌వింద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. మ‌ల‌యాళం సినిమాకు ఇచ్చిన డేట్స్ వ‌ల్ల ప్ర‌యోగ వెంట‌నే సినిమా షూటింగ్‌లో చేరే అవ‌కాశం లేదు. ప్ర‌యోగ డేట్స్ స‌ర్దుబాటు కాక‌పోవ‌డం వ‌ల్లే ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్న‌ట్టు చెప్పారు. ఇక ఆ హీరోయిన్ స్థానంలో బీబీ3 మేక‌ర్స్ న‌యోషా సెహ‌గ‌ల్‌ను ఎంపిక చేశారు. పూర్ణ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. త్వ‌ర‌లో వార‌ణాసి షూటింగ్ షెడ్యూల్ ను షూరూ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *