ప్రియాంక చోప్రాకు హాలీవుడ్ కొత్త మూవీలో ఛాన్స్

బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రాకు హాలీవుడ్ కొత్త మూవీలో ఛాన్స్ వ‌చ్చింది. జ‌ర్మ‌నీలో రిలీజైన ఎన్ ఎం ఎస్ ఫ‌ర్ డిచ్ చిత్రాన్ని హాలీవుడ్ లో రిమేక్ చేస్తున్నారు. ఆఫిల్మ్ లో ప్రియాంకాకు హీరోయిన్ పాత్ర పోషించే అవ‌కాశం ద‌క్కింది. టెక్ట్స్ ఫ‌ర్ యూ పేరుతో ఈ సినిమా ఇంగ్లీష్ లో రిలీజ్ కానున్న‌ది. సోష‌ల్ మీడియా అకౌంట్ ఇన్ స్టా గ్రామ్ లో ప్రియాంకా విష‌యాన్ని వెల్ల‌డించింది. త‌న‌తో న‌టించే కో – స్టోర్ల పేర్ల‌ను కూడా ప్రియాంకా త‌న ఇన్ స్టాలో పోస్టు చేసింది. గ్రామీ విన్న‌ర్ సెలిన్ డియాన్ హీరో సామ్ హూగ‌న్ కూడా ఈ ఫిల్మ్ లో న‌టించ‌నున్నారు. అసాధార‌ణ న‌టీన‌టుల‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌డం అద్భుతంగా ఉంటుంద‌ని ప్రియాంకా కామెంట్ చేసింది. రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీని తెర‌కెక్కించ‌నున్నారు. జిమ్ స్టౌజ్ ఈ చిత్రాన్ని డైర‌క్ట్ చేస్తున్నారు. తెగ ఆనందంతో ప్రియాంకా చేసిన ఇన్ స్టా పోస్టును అభిమానులు స్వాగ‌తించారు. ప్రియాంకా త‌ల్లి మధు చోప్రా, భ‌ర్త నిక్ జోన‌స్ లు కూడా విషెన్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *