దిల్ రాజు సినిమాకు నో చెప్పిన సాయిప‌ల్ల‌వి….

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది కోలీవుడ్ భామ సాయిప‌ల్ల‌వి. స‌హ‌జ‌స‌ద్ద‌మైన న‌ట‌న‌తో కోట్లాదిమంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. ఈ సినిమా ఇచ్చిన స‌క్స్ స్ తో బ్యాక్ టు సినిమాలు చేస్తూ టాలీవుడ్ బిజీ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. తాజాగా ఈ భామ రానాతో క‌లిసి విరాట‌ప‌ర్వం,నాగ‌చైత‌న్య‌తో ల‌వ్ స్టోరీ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవ‌ల ఈ బ్యూటీ దిల్‌రాజు-అనిల్ రావిపూడి కాంబో మూమీ చేయ‌డానికి నో చెప్పింద‌ని టాలీవుడ్ లో టాక్ న‌డుస్తోంది.డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఫీమేల్ ఓరియెంటెడ్ స్టోరీని సాయిప‌ల్ల‌వికి వినిపించ‌గా.. సాయిప‌ల్ల‌వి సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో ఫిదా సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన సాయిప‌ల్ల‌వికి ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చాయి. దిల్ రాజు నిర్మాణ సంస్థ‌లో మ‌రే సినిమా చేయాల‌ని ప్లాన్ చేయ‌గా సాయిప‌ల్ల‌వి నో చెప్ప‌డంతో ఇక ఈ ప్రాజెక్టు సిల్వ‌ర్ స్క్రీన్ పై సంద‌డి చేసేందుకు మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. స‌రిలేరు నీకెవ్వ‌రు టాలీవుడ్ బాక్సాపీస్ వ‌ద్ద మిక్స్‌డ్ టాక్ రావ‌డంతో ఎలాగైనా మంచి హిట్టు కొట్టాల‌ని సీరియ‌స్ గా ఉన్నాడు అనిల్‌రావిపూడి. మ‌రి సాయిప‌ల్ల‌వి నో చెప్పిన స్టోరీని ఏ హీరోయిన్‌తో సెట్స్‌పైకి తీసుకెళ్తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *