త‌మ్ముడు ఇది చీక‌టి ప్ర‌పంచం..’అంధ‌కారం’ ట్రైల‌ర్…

స్వామీరారా, పిజ్జా వంటి సినిమాల్లో న‌టించిన పూజారామ‌చంద్ర‌న్ కీ రోల్ లో న‌టిస్తోన్న చిత్రం అంధ‌కారం. వి విజ్ఞ‌రాజ‌న్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ట్రైల‌ర్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో పూజారామ‌చంద్ర‌న్ అధ్యాప‌కురాలిగా క‌నిపిస్తుండ‌గా.. వినోత్ కిష‌న్ అంధుడి పాత్ర‌లో క‌నిపిస్తున్న‌డు. త‌మ్ముడు ఇది చీక‌టి ప్ర‌పంచం నువ్వ‌నుకున్నంత సామాన్య‌మైంది కాదు… ఓ వ్య‌క్తి అంటే నేను చూడ‌ని చీక‌టా అంటూ వినోత్ చెబుతున్న‌డు. ట్రైల‌ర్ మొద‌ల‌యిన‌ప్ప‌టి నుంచి ఆద్యంతం స‌స్పెన్స్ గా సాగుతూ సినిమాపై అంచ‌నాల‌పై పెంచేస్తుంది. ఈ సినిమాలో పూజా రామ‌చంద్ర‌న్ తో పాటు అర్జున్‌దాస్‌, వినోత్‌కిష‌న్‌, కుమార్ న‌ట‌రాజ‌న్‌, మీనాగోషాల్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్యాష‌న్ స్టూడియోస్‌,ఓ2పి క్చ‌ర్స్ బ్యాన‌ర్లు పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రియ అట్లీ,కే పూర్ణ‌చంద్ర , సుదాన్ సుంద‌ర‌మ్ నిర్మాత‌లుగా తెర‌కెక్కించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *