తార‌క్ చేతులో మ‌రో టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌….

నంద‌మూరి అంద‌గాడు జూనీయ‌ర్ ఎన్టీఆర్ గ‌త ఆరు సినిమాలుగా ప్లాప్ లేని స్టార్ హీరో. సినిమాకి రేంజ్ పెంచుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌గా మార‌బోతున్న హీరో. అందుకే తార‌క్ సినిమాల సెల‌క్ష‌న్ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంది. ఆర్ ఆర్ ఆర్ త‌రువాత త‌న‌కు వ‌చ్చే పాన్ ఇండియా ఇమేజ్‌ను
దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ త‌న త‌రువాత చిత్రాల‌ను ప్లాన్డ్‌గా ఫిక్స్ చేసుకుంటున్నారు. అయిన‌ను పోయి రావ‌లె హ‌స్తిన‌కు అంటూ ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్ మంచి క‌మ‌ర్షియ‌ల్ పొలిటిక‌ల్ మూవీ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా పై తార‌క్ ఫ్యాన్స్‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా ఆస‌క్తి నెల‌కొంది. పైగా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఇప్పటికే క‌న్న‌డ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో ఓ సినిమాకి క‌మిట్ అయ్యాడు. మ‌రో టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ అట్లీతో కూడా ఓ సినిమా ప్లాన్‌లో ఉన్నాడ‌ట తార‌క్‌. ఆ తరువాత మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లోనూ ఓ సినిమా చేసే ఆలోచ‌న‌లో ఎన్టీఆర్‌తోనే సినిమా అనుకుంటున్నాడ‌ట‌. ఏమైనా తార‌క్ ప్లానింగ్ ప‌ర్పెక్ట్‌గా ఉంది. పైగా ఎన్టీఆర్ చూజ్ చేసుకున్న డైరెక్ట‌ర్స్ ..ఆల్ రెడీ వాళ్ళ‌కంటూ ఓ మార్కెట్ ఉంది. అది కూడా ఎన్టీఆర్ సినిమాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ తో చేస్తోన్న సినిమా వ‌చ్చే ఏడాది మార్చి నుండి మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *