టీజ‌ర్ కుమ్మేస్తారు క‌దా బాసూ….

త‌మిళ హీరో విజ‌య్ సినిమాల‌కు టాలీవుడ్‌లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక్క‌డ కూడా ఆయ‌న సినిమాల‌కు మార్కెట్ పెరిగిపోయింది. ఒక‌ప్పుడు ఈయ‌న సినిమాలు వ‌చ్చి వెళ్తున్న‌ట్లు కూడా తెలియ‌దు. ప్రేక్ష‌కుల‌కు.కానీ ప‌ట్టుబ‌ట్టి బ‌ట్టి ఇక్క‌డ కూడా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న మాస్ట‌ర్ సినిమాపై తెలుగులో కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఖైదీ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా త‌ర్వాత లోకేష్ క‌న‌క‌రాజ్ తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు తారాస్థాయిలో ఉన్నాయి. త‌మిళ‌నాట అయితే ఈ చిత్రం కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తున్నారు. ఫ్యాన్స్‌. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న విజ‌య్‌..మాస్ట‌ర్ సినిమాతో కూడా కుమ్మేస్తాడ‌ని వాళ్లు న‌మ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ల అంచ‌నాలు రెండింత‌లు కాదు ప‌దింత‌లు చేసేలా టీజ‌ర్ విడుద‌లైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *