జ‌య‌ల‌లిత బ‌యోపిక్ వ‌ల‌న వెన్నుభాగం దెబ్బ‌తింది

కాంట్ర‌వ‌ర్షియ‌ల్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే కంగ‌నా ర‌నౌత్ ప్ర‌స్తుతం పురుచ్చ‌త‌లైవీ జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌లైవీ పేరుతో ఏఎల్ విజ‌య్ రూపొందిస్తున్న ఈ బ‌యోపిక్ రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి కంగ‌నా లుక్స్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఇవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌తి సినిమా కోసం ఎంతో డెడికేష‌న్‌తో ప‌ని చేసే కంగ‌నా ర‌నౌత్ త‌లైవీ మూవీ కోసం ఏకంగా 20కేజీలు పెరిగింది. అంత బ‌రువుతో భ‌ర‌త‌నాట్యం చేయ‌డంతో వెన్ను భాగం దెబ్బ‌తింద‌ని కంగ‌నా త‌న ట్విట్ట‌ర్ ద్వారా చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమాకోసం పెరిగిన బ‌రువును త‌గ్గించుకునేందుకు ఏడు నెల‌ల స‌మ‌యం కూడా స‌రిపోలేద‌ట‌. ప్ర‌స్తుతం కంగ‌నా ర‌నౌత్ తేజ‌స్‌, జ‌య‌దాక‌డ్ అనే సినిమాలు కూడా చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *