చంద‌మామ‌ సినిమాల‌కు గుడ్‌బై చెప్ప‌బోతుందా…

కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న దాని కంటే కూడా మరో విషయంపై దర్శకనిర్మాతలు ఎక్కువగా కంగారు పడ్డారు. పెళ్లి తర్వాత ఈమె నటిస్తుందా లేదా అని. ఈ విషయంపై కేవలం దర్శక నిర్మాతలకు కాజ‌ల్ అగ‌ర్వాల్ పెళ్లి చేసుకున్న దాని కంటే కూడా మ‌రో విష‌యంపై ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎక్కువ‌గా కంగారు ప‌డ్డారు. పెళ్లి త‌ర్వాత ఈమె న‌టిస్తుందా లేదా అని. ఈ విష‌యంపై కేవ‌లం ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కాదు అభిమానుల‌కు కూడా అనుమానం ఉంది. ఎందుకంటే సాధార‌ణంగా పెళ్లైన త‌ర్వాత హీరోయిన్లు న‌టించ‌డానికి అంత‌గా ఆస‌క్తి చూపించారు. అన్నింటికంటే ముందు పెళ్ల‌యిన హీరోయిన్ల‌ను త‌న సినిమాల్లో తీసుకోవ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఆస్త‌కి చూపించ‌రు. ఒక స‌మంత అక్కినేనిమాత్ర‌మే పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాలు చేసింది. కానీ అందులో రంగ‌స్థ‌లం మాత్ర‌మే రామ్‌చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరోతో న‌టించింది. అదికూడా పెళ్లికి ముందు ఒప్పుకున్న సినిమా. మిగిలిన సినిమాలు లేడీ ఓరియెంటెడ్‌.. మ‌జిలీ మాత్రం భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి న‌టించింది. అంటే పెళ్లి త‌ర్వాత స‌మంత కెరీర్ కూడా డౌన్ అయిపోయింది. ఒప్పుకోవ‌డానికి కాస్త‌క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం.దాంతో సినిమాల‌కు మెల్ల‌గా బ్రేక్ ఇస్తూ వ‌చ్చింది అక్కినేని కోడ‌లు. అభిమానుల‌కు కాజ‌ల్ లేఖ ఇప్పుడు కాజ‌ల్ కూడా ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. పైగా పెళ్లి త‌ర్వాత ఈమె విడుద‌ల చేసిన ఒక లేఖ అభిమానుల్లో లేని అనుమాల‌కు తావిస్తోంది.ప్ర‌స్తుతంగా తెలుగులో చిరంజీవితో ఆచార్య‌.. మంచు విష్ణ‌తో మోస‌గాళ్ళు.. త‌మిళ‌నాట క‌మ‌ల్‌హాస‌న్‌తో భార‌తీయుడు2 సినిమాల్లో న‌టిస్తుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఎన్ని రోజులైనా ప‌ర్లేదు ఒప్పుకున్న సినిమాలు ముందు పూర్తి చేయాల‌ని చూస్తుంది. చంద‌మామ. ఇక ఆ త‌ర్వాత మాత్రం సినిమాల‌కు సెల‌వు ఇచ్చేయాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *