ఉప్పేన మూడో సాంగ్ మ‌హేష్ చేతుల మీదుగా విడుద‌ల…

మెగా కుటుంబం నుంచి వ‌చ్చిన మ‌రో హీరో పంజా వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా, అందాల భామ కృతిశెట్టి హీరోయిన్ గా ఈ చిత్రంతో ప‌రిచ‌యం కాబోతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ స్టార్ న‌టుడు విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా నుండి మూడో సాంగ్‌గా రంగుల‌ద్దుకున్న‌… అనే సాంగ్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేష్ విడుద‌ల చేసిన మ‌హేష్‌కు నిర్మాత‌లు ఎంటైర్ యూనిట్ కు అభినంద‌నలు తెలిపారు. సినిమాలో సాంగ్ విడుద‌ల చేసిన మ‌హేష్‌కు నిర్మాత‌లు ధ‌న్య‌వాదాలు తెలిపారు. కోవిడ్ కార‌ణంగా ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సిన ఈ సినిమా వాయిదా ప‌డింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌లై ఓ క్లారిటీ రానుంది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సాంగ్ ను దివంగ‌త గాన‌గంధ‌ర్వుడు ఎస్‌. పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు అంకిత‌మిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *