ఉప్పెన విడుద‌ల థియేట‌ర్‌లోనే…. ఎందుకో తెలుసా?

పంజా వైష్ణ‌వ్‌తేజ్ క‌థానాయ‌కుడిగా, కృతిశేట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న చిత్రం ఉప్పెన‌. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్నాడు. మైత్రీ మూవీమేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవి శ్రీ‌ప్రసాద్ సంగీతం స‌మ‌కూర్చ‌గా ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల్లో ..నీ క‌న్ను నీలిస‌ముద్రం పాట 140 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేయ‌గా, ధ‌క్‌ధ‌క్‌ధ‌క్ సాంగ్ 25 మిలియ‌న్స్ వ్యూస్‌ను దాటింది. తాజాగా ఈ చిత్రంలోని రంగుల‌ద్దుకున్న‌అనే పాట‌ను హీరో మ‌హేష్‌బాబు చేతుల మీదుగా నవంబ‌రు 11న తేదిన విడుద‌ల చేయ‌నున్నారు. త‌మిళ న‌ట‌డు విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క‌పాత్ర చేస్తున్న ఉప్పెన చిత్రానికి సంబంధించిన నిర్మాణానంత‌ర ప‌నులు పూర్త‌య్యాయి. థియేట‌ర్లు పునః ప్రారంభం కాగానే చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లుగా నిర్మాత‌లు తెలియ‌జేశారు. అయితే ఈ టాలీవుడ్ చిత్రం ఓటీటీలో వ‌స్తుంద‌ని అంద‌రూ ఊహించారు. అయితే ఇది పెట్టారు. కొత్త హీరో సినిమాకు ఓటీటీ భారీ మొత్తాన్ని ఇవ్వ‌డానికి నిరాక‌రించ‌డంతో… ఇక నిర్మాత‌లు ఇంత పెద్ద మొత్తం బ‌డ్జెట్ వ‌ర్క‌వుట్ అవ్వాలంటే ఖ‌చ్చితంగా ఈ చిత్రం థియేట‌ర్ లో విడుద‌ల కావాల్సిందేన‌ని అంటున్నారు. అందుకే ఉప్పెన‌ను థియేట‌ర్‌లోను విడుద‌ల‌చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *