ఆలియా కోసం మ‌రింత ఆల‌స్యం…

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ విప్ల‌వ వీరులు కొమురం భీమ్‌, అల్లూరి సీతారామ‌రాజు జీవితాల స్పూర్తితో ఈ చిత్రం రూపొందుతోంది. బీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్‌, అల్లూరిగా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన అల్లూరి, భీమ్ టీజ‌ర్లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచశాయి. ఈ సినిమాలో చెర్రీ స‌ర‌స‌న హీరోయిన్‌గా బాలీవుడ్ క‌థానాయిక ఆలియాభట్ క‌నిపించింది. అయితే ఆలియాకోసం ఆర్ ఆర్ ఆర్ యూనిట్ మ‌రో రెండు వారాలు వెయిట్ చేయ‌క త‌ప్పేలా లేదు. . ఆలియా ప్ర‌స్తుతం సంజ‌య్‌లీలా భ‌న్సాలీ తెర‌కెక్కిస్తున్న గంగూబాయ్ క‌థియావాడి సినిమాలో న‌టిస్తోంది. ముంబైలో జ‌రుగుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్త‌వ‌డానికి మ‌రో రెండు వారాలు ప‌డుతుంద‌ట‌. ఈ కార‌ణంగా ఆలియా మ‌రో రెండు వారాలు ఆల‌స్యంగా ఆర్ ఆర్ ఆర్ సెట్లో అడుగుపెట్ట‌బోతున్న‌ట్టు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *