అమెజాన్ ప్రైమ్ వారికి పెద్ద బ్రేక్ దొరికింది…

ఒక ప‌క్క త‌మిళ్ తో పాటుగా మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న టాప్ మోస్ట్ హీరోల‌లో సూర్య కూడా ఒక‌రు. త‌న‌దైన సినిమాలు ఎంపిక వాటిని మించిన పెర్పామెన్స్‌ల‌తో సూర్య మంచి గుర్తింపు సంపాదించి పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఇదే సూర్య వల్ల దిగ్గ‌జ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అయిన‌టువంటి అమెజాన్ ప్రైమ్ వారికి పెద్ద బ్రేక్ దొరికింది అని చెప్పొచ్చు. ఈ ఏడాది క‌రోనా మూలాన ఓటిటి ప్ర‌భావం ఎంత‌లా పెరిగిపోయిందో చూసాము. ఇక అదే అద‌ను అనుకోని అమెజాన్ ప్రైమ్ వారు కోకొల్ల‌లుగా సినిమాల‌ను కొనేశారు. అన్ని ముఖ్య భాష‌ల్లో కూడా కొన్నారు. కానీ వాటిలో ప్ర‌తీ దానికి కూడా భారీ హైప్‌ను తెచ్చుకోగ‌లిగారు కానీ తీరా డిజిట‌ల్ రిలీజ్ చేసుకున్నాక బ్యాడ్ నేమ్ నే మూట‌గ‌ట్టుకున్నారు. దీనితో ఒక‌టి పోతే ఇంకొక‌దానికి ప్రేక్ష‌కులు అంచ‌నాలు పెట్టుకున్నారు. ఇక అదే ఊపులో మ‌న తెలుగు మ‌రియు త‌మిళ భాష‌ల్లో సూర్య న‌టించిన లెటెస్ట్ చిత్రం ఆకాశం నీ హ‌ద్దురా విడుద‌ల అయింది. కేవ‌లం ఓటిటి ప్లాట్ ఫామ్ లోకాదు థియేట‌ర్ లో విడుద‌ల కావాల్సిన సినిమా అన్న‌స్థాయిలో టాక్ సంపాదించుకుంది. దీనితో అమెజాన్ ప్రైమ్ వారికి సూర్య వ‌ల్ల ఒక‌స‌రైన హిట్ ప‌డి వారి ప్లాపుల ప‌రంప‌ర‌కు బ్రేక్ ప‌డింద‌ని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *