అప్పుడు ఎంతో బాధ‌ప‌డ్డాః పూగ్డే

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌. తెలుగులోని అగ్రహీరోలంద‌రి స‌ర‌స‌నా అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది. అయితే టాలీవుడ్ కంటే ముందు బాలీవుడ్‌పైనే పూజ దృష్టి సారించింది. ఏకంగా హృతిక్ రోష‌న్ మొహంజ‌దారో సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా ఘోర ప‌రాజ‌యం పాల‌వ‌డంతో అక్క‌డ పూజ కెరీర్ ముందుకు సాగ‌లేదు. దీంతో టాలీవుడ్‌పై దృష్టి సారించి ఇక్క‌డి ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌గ‌లిగింది. ఆ త‌ర్వాత హౌస్ పుల్‌-4తో బాలీవుడ్‌లోనూ స‌క్సెస్ అందుకుంది హిందీలో బాగా గ్యాప్ రావ‌డంపై పూజా తాజాగా స్పందించింది. తొలి సినిమా మొహంజ‌దారో ప‌రాజ‌యం పాల‌వ‌డం న‌న్ను తీవ్రంగా బాధించింది. ఎవ‌రికైనా మొద‌టి సినిమా ఎంతో కీల‌క‌మైంది. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న తొలి సినిమా ఫెయిల్ కావ‌డంతో గుండె ప‌గిలినంత ప‌నైంది. అయితే ద‌క్షిణాదిన విజ‌యం సాధిచడంలో ధైర్యంగా ముందుకు సాగాను. మొద‌టి సినిమా విఫ‌లం కావ‌డం ప‌ల్లే బాలీవుడ్‌లో రెండో సినిమాకు సంత‌కం చేసేందుకు గ్యాప్ తీసుకున్నా హౌస్‌పుల్‌-4 స‌క్సెస్ సాధించ‌డంతో బాలీవుడ్‌పై కూడా దృష్టి సారించాన ని పూజ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *