సైనికుల త్యాగాల‌పై రాజ‌కీయాలు చేయొద్దుః ప్ర‌ధాని

స‌ర్థార్ ప‌టేల్ జ‌యంతి సంద‌ర్భంగా ఏక్తా దివ‌స్‌ను జ‌రుపుకుంటున్నామ‌ని గుర్తుచేశారు. ఉగ్ర‌వాదంపై భార‌త్ నిరంత‌ర పోరు సాగిస్తుంద‌ని, ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా ప్ర‌పంచ దేశాల‌న్నీ ఏక‌మై పోరాడాల‌ని పిలువునిచ్చారు. ఉగ్ర‌వాదం, హింస‌తో ఏ ఒక్క‌రూ ప్ర‌యోజ‌నం పొంద‌లేర‌ని ప‌రోక్షంగా పాక్‌కు చుర‌క‌లంటించారు. దేశం కోసం ప్రాణాల‌ర్పించిన వీర సైనికుల ప‌క్షాన నిల‌వ‌క‌పోవ‌డం బాధించింద‌ని, దేశ ప్ర‌యోజ‌నాల కోసం ఇలాంటి రాజ‌కీయాలు మ‌రోసారి చేయ‌వ‌ద్ద‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో క‌శ్మీర్ అభివృద్దికి ప‌థంలో ప‌య‌నిస్తుంద‌ని అన్నారు. ఈ శాన్య రాష్ర్టాశాంతిని పున‌రుద్ద‌రించి, అభివృద్దికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. ప‌ర్యాట‌క రంగంలో అనేక కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు వ‌స్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. దేశం క‌రోనాపై విజ‌యసాధించేందుకు కృషిచేసిన పోలీసులు, వైద్యులు,ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు త‌దిత‌ర క‌రోనా యోధులకు ప్ర‌ధాని కృత‌జ్ఠ‌త‌లు తెలిపారు.